అమ్మా.. శైలిమా! KTR మానసిక స్థితిపై దృష్టి పెట్టు: విప్ ఆది శ్రీనివాస్ మాస్ ర్యాగింగ్

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అమ్మా.. శైలిమా! KTR మానసిక స్థితిపై దృష్టి పెట్టు: విప్ ఆది శ్రీనివాస్ మాస్ ర్యాగింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ సీఎల్పీ (CLP) మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శానసభలో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక కేటీఆర్ బయట రోడ్ల వెంట తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బట్టలూడదీస్తాం, తోలు తీస్తాం అని తొడలు కొట్టి సవాల్ చేసిన తండ్రీకొడుకులు.. తీరా అసెంబ్లీ సమయానికి ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పలన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంలో తాము విలన్లుగా మిగిలిపోతామనే భయం బీఆర్ఎస్ నేతల్లో నెలకొందని, అందుకే సభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హరీష్ రావు కమిషన్ల కోసమే ఈ మార్పు జరిగిందని స్వయంగా వారి కుటుంబ సభ్యురాలు కవిత అంటున్నారని ప్రస్తావించారు.

కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతుండు..

కేటీఆర్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇంట్లో కవిత (Kavitha)తో పోరు, అసెంబ్లీలో హరీష్ రావు (Harish Rao)తో పోరు.. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారంటూ సెటైర్లు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని కామెంట్ చేశారు. గాంధీల వంశం త్యాగాల కుటుంబమని.. అందులోంచే రాహుల్ గాంధీ వచ్చారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేటీఆర్ వెంటనే రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కవిత ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోందని, ఆయన మానసిక స్థితిపై సతీమణి శైలిమ (Shailima) దృష్టి సారించాలని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపై సూచనలు ఇవ్వడం చేతకాని బీఆర్ఎస్ నేతలు, కేవలం రాజకీయ ఉనికి కోసమే సర్పంచుల అభినందన సభల పేరుతో యాగీ చేస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

Next Story