- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొర్రెల పంపిణీ స్కాం కేసులో ఏ 1 నిందితుడు మొయినుద్దీన్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కాం (Sheep distribution scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు మొయినుద్దీన్‌ను (A1 accused Moinuddin) శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు (ACB officials) శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు (Arrest) చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయగా.. ఇవాళ A1 నిందితుడు అయిన మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో మొయినుద్దీన్‌పై పోలీసులు LOC జారీ చేశారు. కాగా ఈ కేసు నమోదైన వెంటనే మొయినుద్దీన్ తన కుమారునితో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ రోజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రాగానే మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని వెంటనే విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో మొయినుద్దీన్‌దే కీలక పాత్ర అని అధికారుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.
మోయినుద్దీన్ ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కంట్రాక్టరుగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గురువారం అతనికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. అలాగే ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఈ స్కాంలో రాంచందర్, కళ్యాణ్ ల పాత్ర స్పష్టమైంది. వీరిద్దరు కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో.. వివిధ ప్రాంతాల్లో గొర్రెలను కొనాలని రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్ చేసి.. న్యాయస్థానంలో హజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు విధించింది.






