- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy)కి చెందిన ఫామ్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులతో కలిసి సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంతో పాటు భూ అక్రమాల అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావడంతో ఈ కేసు విచారణ వేగవంతమైంది. మొయినాబాద్‌లోని రోహిత్ ఫామ్‌హౌస్ గత కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారింది. తాజాగా రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అసైన్డ్ భూమిలో ఈ ఫామ్‌హౌస్‌ను నిర్మించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలోనే ఫామ్‌హౌస్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
పోలీసుల కఠిన చర్యలు..
డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో అక్కడికి వచ్చిన వారి వాహనాలను సైతం పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఆ వాహనాల యజమానులు ఎవరు.. పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కోర్టు తీర్పు అనంతరం రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనుంది. అనంతరం ఆయన్ని నేరుగా ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి, అక్కడ జరిగిన పార్టీ వివరాలు, ఇతర ఆధారాల కోసం క్షేత్రస్థాయిలో విచారించనున్నట్లుగా సమాచారం.






