మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. వాయిదా

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు.. రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు.. రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని ఇటీవల మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.

కొంతకాలం క్రితం మంచువారి ఫ్యామిలీలో ఆస్తి తగదాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోహన్ బాబును గొడవలపై ప్రశ్నించిన రిపోర్ట్ పై చేతిలో ఉన్న మైకుతో దాడి చేయడంతో అతని ముఖానికి తీవ్రగాయమైంది. ఈ ఘటనపై బాధిత రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

Next Story