- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఫాంహౌస్‌లో మోహన్ బాబు.. పెదరాయుడు పంచాయతీ! ఫామ్‌హౌస్ వీడియో లీక్!
సీనియర్ నటుడు మంచు మొహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇవాళ జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. చిన్న కొడుకు మంచు మనోజ్, పెద్ద కొడుకు విష్ణు ఇద్దరి బౌన్సర్ల మధ్య పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. మరోవైపు మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్‌ను, అతని భార్య మౌనికను ఇవాళ ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టినట్లు తెలుస్తోంది. వారిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన తర్వాత ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫాంహౌస్‌లో మోహన్ బాబు.. పెదరాయుడు పంచాయతీ అంటూ ఓ వీడియో లీక్ అయింది.
జల్‌పల్లిలోని ఫామ్‌హౌస్‌లో అందరితొ కలిసి ఉన్నమోహన్‌బాబు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో మోహన్ బాబు కుర్చీ వేసుకోని కూర్చున్నారు. అతని చుట్టూ చాలా మంది ఉన్నారు. ఆయన ముందు నల్లటి షర్ట్ ధరించిన వ్యక్తి.. బౌన్సర్ లా కన్పిస్తున్నాడు. ఓ ఇద్దరిని కొడుతున్నాడు. వారిని కొడుతుంటే మోహన్ బాబు కుర్చీలో కూర్చుని చూస్తున్నారు. ఈ దృశ్యాలను మోహన్ బాబు ఇంటి పై అంతస్తు నుంచి ఒకరు తీశారు. వారే వీడియో సోషల్‌మీడియాలో లీక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ మోహన్ బాబు పెదరాయుడు తీర్పు ఏమని ఇచ్చుంటారు.. కొట్టిన వాళ్ళు ఎవరు? కొట్టించుకున్న వారు ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.






