Hyderabad: బహిరంగ క్షమాపణ చెప్పిన మోహన్ బాబు

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-15 11:56:46  IST  )

జర్నలిస్టుల ఆందోళనలపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan babu) స్పందించారు.

Hyderabad: బహిరంగ క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల ఆందోళనలపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan babu) స్పందించారు. ఆయన దాడిలో గాయాలపాలై యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందతున్న జర్నలిస్ట్ రంజి‌త్‌(Journalist Ranjith)ను ఆదివారం మోహన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా రంజిత్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదిలా ఉండగా.. మోహన్‌ బాబు(Mohan babu), మంచు మనోజ్‌(Manchu Manoj)కు మధ్య జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.

మంచు ఫ్యామిలీ(Manchu Family) గొడవలను కవర్ చేసేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో రజింత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అలాగే మోహన్ బాబు దాడి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story