Gachibowli: ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు

by Gantepaka Srikanth |   (  Updated:2024-12-11 07:22:21  IST  )

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Gachibowli: ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రి(Gachibowli Continental Hospital)లో చేరారు. ప్రస్తుతం మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు(Manchu Vishnu) ఆసుపత్రికి వచ్చారు. ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాలు(Journalist Associations) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు.. మోహన్ బాబు ఇంటి ఎదుట బైటాయించి ఆందోళనలు చేస్తున్నారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్(Telugu Film Journalist Association) తీవ్రస్థాయిలో ఖండించింది.

Read More : బీపీ, హైపర్ టెన్షన్ కారణంగా మోహన్ బాబు స్థిమితంగా ఉండలేక పోతున్నాడు: డాక్టర్లు

Next Story