- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ తెలంగాణ పర్యటన.. ప్రధానికి కవిత బహిరంగ లేఖ!
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వేళ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా, బీసీ జనగణన సహా 4 కీలక డిమాండ్లు కోరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పర్యటనకు సర్వం సిద్ధం అయింది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వస్తున్న మోడీకి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, దేశంలో సామాజిక న్యాయం సాధనకు సంబంధించిన నాలుగు కీలక అంశాలను తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జాతీయ హోదా కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే 2027 జనగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓబీసీ ఉపకోటాతో మళ్లీ ప్రవేశపెట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఇక తెలంగాణ వెనుకబడిన తరగతుల బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. నీటి భద్రత, డేటా ఆధారిత సామాజిక న్యాయం, లింగ సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలు దేశ సమాఖ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తాయని కవిత అభిప్రాయపడ్డారు. తాను చేసిన ఈ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిగణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






