పెట్రోల్ ధర తగ్గింపుపై తెలంగాణ ప్రజలకు మోడీ సంచలన హామీ

by Satheesh |   (  Updated:2023-11-27 10:33:24  IST  )

తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అని ప్రధాని మోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోడీ కరీంనగర్ బీజేపీ సంకల్ప సభలో

పెట్రోల్ ధర తగ్గింపుపై తెలంగాణ ప్రజలకు మోడీ సంచలన హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ అని ప్రధాని మోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోడీ కరీంనగర్ బీజేపీ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో మార్పు రాబోతుందని.. బీజేపీ అధికారంలోకి రావడం తధ్యమని జోస్యం చెప్పారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ఏర్పడిందా అని మోడీ ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన బంధువులు అవినీతికి పాల్పడేందుకు తెలంగాణ అని మండిపడ్డారు.

నీళ్లు, నిధులు, నియమాకాలు అని కేసీఆర్ అన్నారు.. కానీ తెలంగాణ వచ్చాక ఇచ్చేందేమంటి కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగం అని ఫైర్ అయ్యారు. ప్రజల్ని మోసం చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏ అవకాశాన్ని వదులుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీలన్నారు. తెలంగాణలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయని.. అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని మోడీ కీలక హామీ ఇచ్చారు. మోడీ గ్యారెంటీ అంటే పూర్తిగా పూర్తి అయ్యే గ్యారెంటీ అని అన్నారు.

Next Story