- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ ఆశయాలు నేరవేర్చే దిశగా మోదీ పాలన.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
అంబేద్కర్ ఆశయాలు నేరవేర్చే దిశగా మోదీ పాలన సాగుతోందని మహబూబ్ నగర్ (Mahaboob Nagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ (BJP MP DK Aruna) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్ ఆశయాలు నేరవేర్చే దిశగా మోదీ పాలన సాగుతోందని మహబూబ్ నగర్ (Mahaboob Nagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ (BJP MP DK Aruna) అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి (Dr. BR Ambedkar Birth Anniversary) సందర్భంగా మహబూబ్ నగర్ న్యూ బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు (Tributes) అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయమందిర (Collector Vijayamandhira) తో పాటు జిల్లా బీజేపీ, దళిత మోర్చా నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ఏప్రిల్ 25 వరకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశాన్ని ప్రధాని మోదీ (PM Narendra Modi) మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారని, ఆయన ఆశయాలు నేరవేర్చే దిశగా మోదీ పాలన సాగుతోందని చెప్పారు.
ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పోయి సమానత్వం సిద్దించాలని, ఇందులో భాగంగానే స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి.. అంటే 2047 కల్లా వికసిత్ భారత్ (Vuiksit Bharath) లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఏడాది అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఈ దేశంలో అంబేద్కర్ లక్ష్యాలు, ఆకాంక్ష నెరవేరాలని, అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ గుండెల్లో నింపుకోవాలని అన్నారు. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.






