మలేషియాలో మోదీకి ఘన స్వాగతం.. వేదికపై అదరగొట్టిన తెలంగాణ కళాకారులు

by Kema Shiva Kumar |

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రవాస భారతీయుల సభలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది.

మలేషియాలో మోదీకి ఘన స్వాగతం.. వేదికపై అదరగొట్టిన తెలంగాణ కళాకారులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రవాస భారతీయుల సభలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. మలేషియాలో నివసిస్తున్న భారతీయ సంతతి ప్రజలు, ప్రవాస భారతీయులు ప్రధానికి ఘనమైన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మైటా (Malaysia Telangana Association) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా బతుకమ్మ సంబరాలు, బోనాల కోలాహలం, సాంప్రదాయ లంబాడీ నృత్యాలు, అంతర్జాతీయ వేదికపై మన పండుగలను, కళలను వీక్షించిన ప్రేక్షకులను ఈ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మలేషియాలో భారతీయ కళా వైభవాన్ని చాటిచెప్పడంలో మైటా కీలక పాత్ర పోషించింది.

మహిళా సభ్యులకు ప్రత్యేక అభినందనలు..

ఈ ప్రదర్శన గురించి మైటా అధ్యక్షులు సైదం తిరుపతి మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన నేపథ్యంలో కేవలం 7 నిమిషాల నిడివి గల ఈ నృత్యప్రదర్శనను అత్యంత తక్కువ సమయంలో సిద్ధం చేసి, విజయవంతంగా ప్రదర్శించిన మైటా మహిళా సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచస్థాయి వేదికపై మన తెలంగాణ అస్తిత్వాన్ని చాటినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైటా కోర్ కమిటీ సభ్యులు, సంస్థ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొని ప్రధాని మోదీకి తమ మద్దతును, ప్రేమాభిమానాలను తెలియజేశారు.

Next Story