తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోడీ, రాహుల్ గాంధీ.. స్వయంగా ఆహ్వానించనున్న సీఎం

by Ajay Maddhiboyina |

డిసెంబ‌ర్ 8,9 తేదీల్లో ఫూచ‌ర్ సిటీలో ప్ర‌భుత్వం తెలంగాణ రైజింగ్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మోడీ, రాహుల్ గాంధీ.. స్వయంగా ఆహ్వానించనున్న సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: డిసెంబ‌ర్ 8,9 తేదీల్లో ఫూచ‌ర్ సిటీలో ప్ర‌భుత్వం తెలంగాణ రైజింగ్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ స్వయంగా వీరిని ఆహ్వానించనున్నారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులను సైతం ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సైతం ఆహ్వానపత్రికలు పంపనున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆహ్వాన‌క‌టిమీలు ఏర్పాటు చేసి ఆహ్వానాల కోసం ప్ర‌త్యేక వెబ్ సైట్, డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇక ఇప్పటికే 4,500 మందికి ఆహ్వాన పత్రికలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని టోనీ బ్లేయ‌ర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాల‌జీ గ్రూప్ డైరెక్ట‌ర్ ఎరిక్ స్విడ‌ర్ ల‌కు సైతం ఆహ్వాన ప‌త్రిక‌లు పంపిన‌ట్టు తెలుస్తోంది.

Next Story