- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోజు నుంచే మోడీ సర్కార్ కక్ష సాధింపులు.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సంచలన కామెంట్స్
లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని, ఆరోజు నుంచే మోడీ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతుందని, న్యాయ పోరాటం చేయడమే మన ముందున్న లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని, ఆరోజు నుంచే మోడీ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతుందని, న్యాయ పోరాటం చేయడమే మన ముందున్న లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ (AICC Telangana Incharge) మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్లను ఈడీ చార్జిషీట్ లో చేర్చడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ (Hyderabad ED Office) ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం (BJP Government)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆమె.. పార్లమెంట్ సాక్షిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly Elections) బీజేపీని ఓడగొట్టడానికి వస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారని, ఆరోజు నుండే నోటీసులు ఇస్తూ మోడీ సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందని తెలిపారు. అలాగే ఈ రోజు మన దేశంలో ఆందోళనకర పరిస్థితి నెలకొన్నదని, భవిష్యత్తు తరానికి మంచి జరుగుతుందో లేదో అనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళాలో కుల వివక్ష చూపించారని, హిందూ రాష్ట్రంలో పేద గుడిసెలో ఉండే పేద ప్రజలను డంపింగ్ యార్డ్, చెత్త వేసే దగ్గర వేశారని, ఆ సమయంలో వారు హిందవులని కూడా చూడరని హాట్ కామెంట్స్ చేశారు.
పేద ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈడీ కేసులు, విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోనే తెలంగాణలో కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC Classification) చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress Party) అని, ఇదే దేశం మొత్తం జరగాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని తెలిపారు. ప్రస్తుతం మన ముందున్న మొదటి లక్ష్యం న్యాయం కోసం పోరాటం చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ అనేది నాన్ ప్రాఫిట్ సంస్థ అని, సంస్థ బైలాస్ లో ఉంది లావాదేవీలు జరపవద్దని నిర్ణయించారని, మరి పైసల లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఉండేవని, అప్పుడు ఇందిరా గాంధీ పోరాటం చేశారు.. ఇప్పుడు మన వంతు అని మీనాక్షి చెప్పారు. ట్రంప్ (Trump) నిర్ణయాలపై మోడీ(PM Modi) ఎందుకు మాట్లాడటం లేదని, మోడీకి ట్రంప్ స్నేహితుడే కదా.. మరి ట్రంప్ నిర్ణయాలతో దేశానికి నష్టం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ధనికునికైనా, పేద వాడికైనా ఓటు విలువ ఒక్కటేనని, సామాజిక న్యాయం అందరికీ అందాలంటే కొత్త నినాదంతో ముందుకు వెళ్ళాలని సూచించారు. ఇక అదే కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మన పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ పిలుపునిచ్చారు.






