మోడీ పాకిస్థాన్‌కు భయపడుతున్నారు: టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-28 16:22:13  IST  )

పాకిస్థాన్ కు ఇందిరాగాంధీ అంటే గడగడ లాడే పరిస్థితి ఉండేదని, కానీ ఈనాడు మోడీ పాకిస్థాన్‌కు భయ పడుతున్నాడని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.

మోడీ పాకిస్థాన్‌కు భయపడుతున్నారు: టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాకిస్థాన్ కు ఇందిరాగాంధీ అంటే గడగడ లాడే పరిస్థితి ఉండేదని, కానీ ఈనాడు మోడీ పాకిస్థాన్‌కు భయ పడుతున్నాడని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశం సామాన్యుల చేతికి రావాలని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ చేశారని, రాజీవ్ గాంధీ సాంకేతికతను దేశానికి పరిచయం చేశారన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం గాంధీ భవన్‌లో నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు పూలమాల వేసి మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.

మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఆర్థిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని, ఈరోజు మోదీ మాత్రం గాంధీ పేరు తొలగించి ఆ పథకాన్ని నీరు గార్చే పని చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో పార్టీ ఏర్పాటు అయిందని ఆయన అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిదని, మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యమేలుతున్న నాయకులు ఎంత?..నెహ్రూ ప్రధాని కాకుండా ఉంది ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేం.. ఆయన పోషించిన పాత్ర వల్లే.. దేశం ఈ స్థాయికి ఎదిగిందన్నారు.

రాష్ట్రంలో చారిత్రాత్మక కుల సర్వే చేశారని, అన్ని వర్గాలకు సరైన ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కుల సర్వే జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చెయ్యాలని చూస్తే..బీజేపీ అడ్డం పడిందని, ఆ పార్టీ విధానాలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ వంత పాడుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ రాజ్యాంగాన్ని నీరు గార్చి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పని చేపట్టిందని, కార్పొరేట్ లకు మేలు చేసే విధానాలు తప్ప... ప్రజల గురించి మోడీ ప్రభుత్వం అసలు ఆలోచనే చేయడం లేదని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గుండు సూది తయారు చేయలేని స్థితి నుంచి రాకెట్ ప్రయోగాల వరకు దేశం ఎదిగింది అంటే.. అది ప్రధానిగా నెహ్రూ వేసిన పునాదులే కారణమన్నారు.

Next Story