- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mock polling: ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ఎంపీలకు మాక్ పోలింగ్.. పాల్గొన్న ఈటల
ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంపై బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్, మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Vice Presidential election) ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంపై (BJP MPs) బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్, మాక్ పోలింగ్ (Mock polling) నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వర్క్‌షాప్ కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్‌లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీలకు జరుగుతున్న వర్క్ షాప్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) పాల్గొన్నారు. ఎల్లుండి జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇండియా కూటమి ఎంపీలకు రేపు మాక్ పోల్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీలకు మాక్ పోల్ నిర్వహించి సిద్దం చేస్తున్నారు. వర్క్‌షాప్, మాక్ పోల్‌కు ఎంపీలు కచ్చితంగా హాజరు కావాలని పార్టీ అగ్రనేతలు వారికి ఆదేశాలిచ్చారు. తొలిసారి గెలిచిన ఎంపీలు, యువ ఎంపీలకు ఎన్నిక విధానాన్ని తెలపడం కోసం మాక్ పోల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రస్తుత ఓటర్లలో 782 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు వారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy)ని ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిన విషయం విదితమే.






