Mock Drill : తెలుగు రాష్ట్రాల్లో మోగిన మాక్ డ్రిల్ సైరన్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-07 11:50:29  IST  )

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్(Mock Drill) సైరన్ మోగింది.

Mock Drill : తెలుగు రాష్ట్రాల్లో మోగిన మాక్ డ్రిల్ సైరన్
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్(Mock Drill) సైరన్ మోగింది. తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad) లో ఏపీలోని వైజాగ్(Vishakhapatnam), తిరుపతిలో మాక్ డ్రిల్ సైరన్ మోగడంతో డ్రిల్ మొదలు పెట్టింది డిఫెన్స్ బృందం. పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ డ్రిల్ లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ DRDO,మౌలాలి NFC తోపాటు.. వైజాగ్ వన్ టౌన్ లోని క్వీన్ మేరీ స్కూల్ లో ఈ డ్రిల్స్ జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ డ్రిల్ కు ప్రజలు సహకరించాలని పోలీసులు, డిఫెన్స్ ఇదివరకే రిక్వెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో కూడా డ్రిల్ సైరన్ మోగడంతో.. మాక్ డ్రిల్ మొదలైంది. యుద్ధ సమయంలో, అత్యవస సమయాల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. కాగ్ ఈ మాక్ డ్రిల్ లో NDRF, SDRF, డిఫెన్స్, ఫైర్ సిబ్బంది పాల్గొంటున్నారు.

Next Story