- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Civil Mack Drill : హైదరాబాద్ లో రేపు 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు హైదరాబాద్(Hyderabad) లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్(Civil Mack Drill) నిర్వహించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు హైదరాబాద్(Hyderabad) లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్(Civil Mack Drill) నిర్వహించనున్నారు. పహెల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం భారత్-పాకిస్తాన్‌ల(Bharat-pak Conflicts) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు ఈనెల 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. నగరంలోని 4 ప్రధాన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి డిఫెన్స్ బృందాలు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ DRDA, మౌలాలి NFC లో ఈ మాక్ డ్రిల్ జరగనుందని అధికారులు ప్రకటించారు.
3 కేటగిరీలుగా విభజన
దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో అణువిద్యుత్ కేంద్రాలు ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా వంటి జిల్లాలు ఉన్నాయి. ఇక రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు, మూడో లిస్టులో 45 జిల్లాలు ఉన్నాయి. కాగా హైదరాబాద్, విశాఖలోని ఎయిర్ పోర్టులు, జన సమర్థ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. వైమానిక దాడి సైరన్‌ను ఎలా అనుసరించాలి? బ్లాక్ అవుట్ పరిస్థితిలో ఏమి చేయాలో చెప్పాలని సూచించారు. ప్రథమ చికిత్స కోసం ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు.. మందుల గురించి డిఫెన్స్ బృందాలు వివరించనున్నాయి.
రేపు దేశవ్యాప్త మాక్ డ్రిల్ నేపథ్యంలో ఇవాళ యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు, ఎన్డీఎంఏ అధికారులు హాజరయ్యారు. సీఎస్‌లతో గోవింద్ మోహన్ వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దిశానిర్దేశం చేశారు.






