నగర ప్రజలకు అలర్ట్.. ఈ రోజు రాత్రి మొత్తం తిరగనున్న MMTS రైళ్లు

by Malleboina Mahesh |

వినాయక నిమజ్జనం సందర్భంగా రైల్వే శాఖ ఈ రోజు రాత్రి మొత్తం MMTS రైళ్లను పడపాలని నిర్ణయం తీసుకుంది.

నగర ప్రజలకు అలర్ట్.. ఈ రోజు రాత్రి మొత్తం తిరగనున్న MMTS రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఊరేగింపులు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా ట్యాంక్ బండ్‌లో నిమజ్జనాలు కొనసాగుతోన్నప్పటికి ఈ రోజు కూడా మరిన్ని విగ్రహాలు రోడ్లపైకి వచ్చాయి. ఇదే చివరి రోజు కావడంతో వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు పయనమయ్యాయి. దీంతో అన్ని మార్గాలు వినాయకుడి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మెట్రో రైలు భక్తులు, ప్రయాణికులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి మొత్తం MMTS రైళ్లను నడపాలని నిర్ణయించింది. రేపు ఉదయం 4.40 వరకు అన్ని మార్గాల్లో MMTS రైళ్లను నడపనున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ రోజు సాయంత్రం ప్రకటించింది.

ఇందులో భాగంగా సికింద్రాబాద్‌-ఫలక్‌ నుమా.. సికింద్రాబాద్‌-హైదరాబాద్‌. హైదరాబాద్‌-లింగంపల్లి.. లింగంపల్లి-ఫలక్‌నుమా. ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య 8 MMTS రైళ్లు కంటిన్యూగా రాత్రి 4. 40 నిమిషాల వరకు తిరగనున్నాయి. ఈ నిర్ణయంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన వినాయక భక్తులు, నాంపల్లి, లక్డీకపూల్, ఖైరతాబాద్, నక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్లలో MMTS రైళ్లను ఎక్కేందుకు వీలు ఉంది. ముఖ్యంగా రాత్రి వచ్చే విగ్రహాలను మొత్తం నెక్లెస్ రోడ్డుకు తరలించనున్నారు కాబట్టి.. నక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం తో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story