ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు 2 MMTS స్పెషల్స్

by Muthe.Rajitha |

అర్థరాత్రి న్యూ ఇయర్ వేడుకలు జారుకోడానికి యువత భారీగా ఇళ్ల నుంచి బయటికి వస్తారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రోజు 2 MMTS స్పెషల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అర్థరాత్రి న్యూ ఇయర్ వేడుకలు జారుకోడానికి యువత భారీగా ఇళ్ల నుంచి బయటికి వస్తారు. అయితే అర్థరాత్రి తర్వాత తిరిగి ఇళ్లను చేరుకోడానికి ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే 2 MMTS స్పెషల్ ట్రైన్స్ ను వేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో ఒకటి జనవరి 1న అర్థరాత్రి 1.15 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి చందానగర్, హఫీజ్ పేట్, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, బేగంపేట్, ఖైరతాబాద్, లక్డికాపూల్, మీదుగా నాంపల్లి చేరుకుంటుంది. మరో ట్రైన్ అదేరోజు అర్థరాత్రి 1.30 బయల్దేరి లింగంపల్లి నుంచి ఫలక్ నామా కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Next Story