గ్లోబల్ సమ్మిట్.. పాటలతో అలరించిన ఎం.ఎం. కీరవాణి బృందం

by Ramesh Naini |

ఎం.ఎం.కీరవాణి బృందం, కళాకారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

గ్లోబల్ సమ్మిట్.. పాటలతో అలరించిన ఎం.ఎం. కీరవాణి బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలి రోజు భారీగా ఎంవోయూలు కుదిరాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో వివిధ కంపెనీలతో రూ. 1.88 లక్షల కోట్ల మేరు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం సమయంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మరింత సందడి వాతావరణం నెలకొంది. సమ్మిట్‌లో తెలంగాణ వైభవం చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ కట్టుకుంటున్నాయి. అలాగే టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి బృందం పాటలతో అలరించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తదితరులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తికరంగా వీక్షించారు. ప్రోగ్రామ్ అనంతరం ఎం.ఎం.కీరవాణి బృందం, కళాకారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

Next Story