సీఎం రేవంత్‌కు, మంత్రులకు పడటం లేదు: ఎమ్మెల్సీ

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్‌కు, మంత్రులకు పడటం లేదు: ఎమ్మెల్సీ

సీఎం రేవంత్‌కు, మంత్రులకు పడటం లేదు: ఎమ్మెల్సీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా పాలన పేరిట అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాలాగా పని చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గాజుల రామారంలో 11ఎకరాలు భూ కబ్జా చేశారని.. ఆయన పార్టీ మారిన తరువాత ఆ భూమిని ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌కు భజన చేస్తే చాలు, పార్టీ ఫిరాయింపులు చేస్తే చాలు భూ బదలాయింపు అవుతున్నదని పేర్కొన్నారు. అమ్మిన భూమికి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి.. భూ భారతిలో అరికెపూడి గాంధీ పేరు మీద ఎంట్రీ చేశారని ఆరోపించారు. మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి వినతులు ఇచ్చారని.. సీసీఎల్ఏకు, సీఎస్, జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా, విజిలెన్స్ కమిషనర్, కూకట్‌పల్లి కమిషనర్‌కు, ఇతర పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు.

ఐడీపీఎల్ భూమి మీద విచారణ అంటూ ఒక్క సర్వే నంబర్ మీద మాత్రమే చేస్తున్నారని.. అరికెపూడి గాంధీ ల్యాండ్ కబ్జాపై ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే గాజులరామారంలో 307సర్వే నంబర్‌లో ఉన్న భూమి వద్దకు పోదామా అని నిలదీశారు. భూ ఆక్రమణలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంకు, మంత్రులకు పడడం లేదని.. హిల్ట్ పాలసీ డాక్యుమెంట్ మంత్రులే బయటకు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం మంచి చేస్తే 90 శాతం సీట్లు గెలవాలని.. కానీ, అధికారంలో ఉన్న పార్టీ 50 శాతం మాత్రమే గెలవడం సిగ్గుచేటని అన్నారు. తాత మనువడు ఆడుకోవడానికి ప్రభుత్వ ఖజానా నుండి రూ.200 కోట్లు ఖర్చు చేశారని.. ఎవరి కోసం ఈ ఖర్చు మిస్టర్ రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు.

Next Story