MLC Vijayashanthi: కనీసం ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేయండి..విజయశాంతి తీరుపై సొంత పార్టీలో విమర్శలు

by Prasad Jukanti |

ఎమ్మెల్సీ విజయశాంతి తీరుపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

MLC Vijayashanthi: కనీసం ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేయండి..విజయశాంతి తీరుపై సొంత పార్టీలో విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు యాక్టివ్ అవుతున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా రోజుకో కొత్త అంశంతో మాటల యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీలోని ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanthi) తీరు తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) చర్చనీయాశంగా మారింది. రాములమ్మ సినీ, పొలిటికల్ గ్లామర్ పార్టీకి, ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తే ఆమె సైలెంట్ మోడ్ లో ఉండటం హస్తం పార్టీ నేతలకు షాక్ కు గురి చేస్తోంది. ఎందరో ఆశావహులు ఉన్నా వారందరినీ పక్కన పెట్టి పిలిచి మరీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ వచ్చాక ఆమె ఎక్కడా కనిపించడం ఇప్పుడు సొంత పార్టీలోనే విమర్శలకు దారి తీస్తోంది.

ఎమ్మెల్సీ పదవికి న్యాయం చేయండి:

తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న రాములమ్మ గతంలో బీఆర్ఎస్, బీజేపీలో పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో ఆమెను ప్రచారకమిటీలో కీలక బాధ్యతలు అప్పగిచారు. ఆ తర్వతా పార్టీ అధికారంలోకి వచ్చాక విజయశాంతి పూర్తిగా మౌనం వహించారు. ఈ క్రమంలో పదవి ఇస్తే పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతారని లెక్కలు వేసుకున్నారో ఏమో కానీ ఎవ్వరూ ఊహించని విధంగా హస్తం పార్టీ పెద్దలు విజయశాంతికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి అప్పగించింది. అయితే ఎమ్మెల్సీగా చేయడంతో ఆమె కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీల విమర్శలను తిప్పికొట్టడంలో గులాబీ బాస్ కేసీఆర్ పై విమర్శలు సంధించడంలో విజయశాంతి తన సత్తా చూపుతారని అంతా భావించగా అందుకు భిన్నంగా విజయశాంతి వైఖరి అవలంభిస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదని ఎమ్మెల్సీ పదవి వచ్చాక అడపాదడపా మీడియా ముందుకు రావడం, గాంధీ భవన్ కు వచ్చి మీడియాతో మాట్లాడారే తప్ప పెద్దగా కనిపించడం లేదనే చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. అసలే సర్కార్ ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్సీగా ఉంటూ వాటిని ఖండించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కనీసం తీసుకున్న ఎమెల్సీ పదవికైనా న్యాయం చేయండి రాములమ్మ అంటూ సొంత పార్టీ సోషల్ మీడియా వారియర్లే పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారుతోంది.

Next Story