రాజకీయాలు పక్కనబెట్టి బాధ్యత తీసుకోండి.. కిషన్ రెడ్డికి MLC విజయశాంతి సూచన

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-02 17:05:27  IST  )

తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(MLC Vijayashanthi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

రాజకీయాలు పక్కనబెట్టి బాధ్యత తీసుకోండి.. కిషన్ రెడ్డికి MLC విజయశాంతి సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(MLC Vijayashanthi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘హైదరాబాదులో మెట్రో(Hyderabad Metro) రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ అనుమానం తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి మెట్రోపై ఎన్నిసార్లు ప్రతిపాదన చేసినా.. ఫలితం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే కారణం వల్లే కేంద్రం మెట్రో విస్తరణపై జాప్యం చేస్తోందన్న వాదన కూడా ఉంది. రాజకీయాలు పక్కనపెట్టి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయండి.

జీహెచ్ఎంసీలో బీజేపీకి 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు. అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే ఓట్లేసి బీజేపీ కార్పొరేటర్లను నగర ప్రజలు గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కిషన్ రెడ్డి(Kishan Reddy) బాధ్యత తీసుకొని కేంద్రాన్ని ఒప్పించి మెట్రో ప్రాజెక్టుకు అనుమతి వచ్చేలా చేయాలి’ అని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సూచించారు.

Next Story