- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. రేపే అధికారిక ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త పార్టీ(Political Party) పెడుతున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కొత్త పార్టీ(Political Party) పెడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 'బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి' అని తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ‘సెప్టెంబరు 17 అంటే తెలంగాణ(Telangana) విమోచన దినం అని కొంతమంది, విద్రోహ దినం అని మరి కొంతమంది అంటున్నారు. వాస్తవానికి భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజు సెప్టెంబరు 17. ఈ నేపథ్యంలో అదే రోజు పార్టీని ఏర్పాటు చేస్తున్నాం’ అని మల్లన్న వివరించారు. రాష్ర్టంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బీసీలను పార్టీలు ఎలా మోసం చేస్తున్నాయో లెక్కలతో సహా వివరిస్తానని చెప్పారు. పార్టీ విధివిధానాలను రేపు వెల్లడించనున్నట్లు సమాచారం.






