- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియాపై కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్కమాట.. రాష్ట్రంలో ఒకమాట : ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు
యూరియాపై కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్కమాట, రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆరోపణలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : యూరియాపై కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్కమాట, రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ మేరకు శ్రవణ్ దాసోజు తన X ఖాతా వేదికగా ట్వీట్ చేసారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కొరత ఉంది అని కేంద్ర రసాయన శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చి, పార్లమెంట్ ముందు ధర్నా చేసారని, టి.కాంగ్రెస్ ఎంపీల ధర్నా లో ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారని అన్నారు. కానీ తమాషాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాత్రం రాష్ట్రంలో యూరియా కొరత లేదని, బీఆర్ఎస్ రైతులను రెచ్చగొడుతుందని చెబుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్పులు పెట్టి భయాందోళనలు సృష్టిస్తున్నారని నిందలు మాపై మోపుతున్నారని, ఒకవేళ ఇదే నిజమైతే, ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలెందుకు చేసారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఈ పొంతన లేని మాటలెందుకని, ఎందుకీ అలసత్వం, ద్వంధ విధానాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమా మీకు అంటూ శ్రవణ్ దాసోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.






