- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్.. సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు (MLC Shambhipur Raju) మొబైల్ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ (Hack) చేశారు. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ తమ వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫోన్ హ్యాక్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధుల కమ్యూనికేషన్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి సైబర్ దాడులు (Cyber Attack) ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. తన ఫోన్ నుంచి ఎవరైనా తప్పుడు సందేశాలు లేదా కాల్స్ చేసినట్లయితే వాటిని నమ్మవద్దని శంభీపూర్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






