- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC polling: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/బ్యూరో కరీంనగర్/ డైనమిక్ బ్యూరో : తెలంగాణలో రెండు టీచర్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Election) స్థానానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు సాగింది. 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉమ్మడి కరీంనగర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానానికి 40.61 శాతం, ఇవే జిల్లాల్లో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 63.49 శాతం, వరంగల్- నల్లగొండ- ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ (Teacher MLC) స్థానానికి 76.35 శాతం పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం ఇందులో ఇటు గ్రాడ్యుయేట్లు, అటు టీచర్ల పల్స్ ఎలా ఉండబోతుందనేది ఈ ఎన్నికలతో తేలనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఎలాగైనా గెలిచేందుకు అధికార కాగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా కృషి చేశాయి.
వార్ వన్ సైడ్ : ప్రసన్న హరికృష్ణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ అన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇవాళ కరీంనగర్‌లో ఓటింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రసన్న హరికృష్ణ ఎన్నికల సరళి చూస్తే తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలవంతులు, కార్పొరేట్ శక్తులు ఎన్ని కుట్రలు చేసినా పట్టభద్రులు వారి కుట్రలను పటాపంచలు చేస్తూ తీర్పును ఇవ్వబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ వాదం లేదు అని ప్రచారం చేసిన వారికి బీసీ వాదం పేపర్లు, సోషల్ మీడియాల్లో కాకుండా ప్రతి బీసీ నరనరాన ఉందని తమ ఓటుతో నిరూపించబోతున్నారన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణలో కొత్త చరిత్రను సృష్టించి భవిష్యత్ తరాలకు ఓ మార్గం చూపించనున్నాయన్నారు. డబ్బున్నవాళ్లు కాకుండా సామాన్యులు సైతం ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తాయని పేర్కొన్నారు.






