Mahender Reddy: అభివృద్ధి అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు

by Gantepaka Srikanth |

మాజీ మంత్రి కేటీఆర్​ఓర్వలేక రాజకీయం చేస్తున్నాడని, కేవలం ఉనికి కోసమే ఆరాటపడుతున్నాడని శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

Mahender Reddy: అభివృద్ధి అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్​ఓర్వలేక రాజకీయం చేస్తున్నాడని, కేవలం ఉనికి కోసమే ఆరాటపడుతున్నాడని శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేయకూడదని సూచించారు. గాంధీభవన్‌లో శుక్రవారం పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది ఒక్క రోజులో అయ్యే పనికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు రైతు భరోసాగా ఎకరాకు ఏటా 12 వేల రూపాయలు అందజేస్తామని.. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు రైతులందరి ఖాతాలో మొదటి విడతగా ఎకరాకు రూ.6 వేల రైతు భరోసా వేస్తామని, అలాగే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 54 వేల కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందజేసిందని, 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే కేటీఆర్​తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇకనైనా కేటీఆర్​తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రుణమాఫీ రాలేదని కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన జానమ్మ అనే మహిళ షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన రైతు సునుగంటి జోగి రెడ్డి సతీమణి అని. ఆయా మూడు ఎకరాల ఐదు సెంట్ల భూమి తన కొడుకులు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి పేర్లపై చేయడంతో ఆమె పేరు పైన భూమి లేక పోవడంతో రుణమాఫీ వర్తించలేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేసిన రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ లెక్కలు ప్రతి గ్రామంలో రాష్ట్రమంతటా చూపిస్తానని, రుణమాఫీ జరగని పక్షంలో చేయని పక్షంలో నేను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. నిరూపిస్తే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సవాల్​చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే కేటీఆర్ ఉద్దేశ్యమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story