ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

by Ajay Maddhiboyina |

పెండింగ్ సమస్యల పరిష్కారం, పీఆర్సీ సాధన లక్ష్యంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ తలపెట్టిన ఆందోళన కార్యాచరణకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెండింగ్ సమస్యల పరిష్కారం, పీఆర్సీ సాధన లక్ష్యంగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ తలపెట్టిన ఆందోళన కార్యాచరణకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సహచర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజి రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఐదు డీఏలు విడుదల, పెండింగ్ బకాయిలు చెల్లించడం, పాత పెన్షన్ పథకం పునరుద్ధరించడం, జీవో 317 సమీక్ష చేయడం వంటి డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు.

గత 18 నెలలుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి బిజెపి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రేవంత్ ​ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలంటే గిట్టడం లేదని, వారికి సమస్యలు ఉంటే పట్టించుకోకుండా డైవర్షన్ పాలిట్రిక్ ​చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మోడీ ప్రభుత్వం చేపట్టే కులగణన దేశ చరిత్రలో చిరస్ధాయిగా నిలుస్తుందని, తమ ఒత్తిడితోనే కేంద్రం ఈనిర్ణయం తీసుకుందని కాంగ్రెస్​నేతలు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వారి పాలనలో కుల గణన ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.

Next Story