- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్కో ద్వారా దుస్తులు కొనుగోలు చేయాలి
by velandi.Saikiran |
చేనేత రంగంలో టెండర్ల విధానానికి స్వస్తి పలికి పాత విధానంలోనే టెస్కో ద్వారా దుస్తుల కొనుగోలు చేయాలని రమణవిజ్ఞప్తి చేశారు.

X
టెస్కో ద్వారా దుస్తులు కొనుగోలు చేయాలి
- పాత జీవోను యథావిధంగా అమలు చేయాలి
- సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఎల్.రమణ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత రంగంలో టెండర్ల విధానానికి స్వస్తి పలికి పాత విధానంలోనే టెస్కో ద్వారా దుస్తుల కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. మార్చి 11న ఇచ్చిన జీవోను యథాతథంగా అమలు చేయాలని కోరారు. విద్యార్థుల యూనిఫామ్ తయారీకి సంబంధించిన రూ.105 కోట్ల ఆర్డర్‌ను టెస్కోకు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే.. వివిధ సంక్షేమ శాఖలకు అవసరమయ్యే దుస్తులను సైతం టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Next Story






