వారి సమస్యలు పరిష్కరించండి.. CM రేవంత్‌‌కి ఎమ్మెల్సీ కోదండరాం రిక్వెస్ట్

by Gantepaka Srikanth |

ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ జనసమితి నేతలు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలు పరిష్కరించండి.. CM రేవంత్‌‌కి ఎమ్మెల్సీ కోదండరాం రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ జనసమితి నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో సీఎంతో భేటీ అయ్యారు. పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసమితి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని సీఎం వారికి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు అర్జున్, బద్రుద్దీన్, శ్రీనివాస్, శంకర్ రావు, రమేష్ ముదిరాజ్, ఆశప్ప, సలీం, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story