- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం: MLC కవిత హెచ్చరిక (వీడియో)
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల గురించి తీవ్రంగా స్పందించారు. తాము కూడా పింక్ బుక్(Pink Book)లో అన్నీ రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలిపెట్టబోమని హెచ్చరించారు. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు... మీ లెక్కలు తీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్‌పై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరంగల్‌కు రాకుండా పారిపోయారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు... కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి.. నిధులు పారాయి.. కానీ 95 శాతం పూర్తయిన సమ్మక్క-సారక్క బ్యారేజీ పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని.. ఇది చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని సీరియస్ కామెంట్స్ చేశారు. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. అవకాశవాదం కోసం పార్టీ మారిన కడియం శ్రీహరిని క్షమించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌కు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్‌లు మాయమయ్యాయని ఎద్దేవా చేశారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియింబర్స్ మెంట్ చేయకుండా విద్యార్థుల, రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా రైతులను, సన్నబియ్య ఇవ్వకుండా ప్రజలను, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అన్ని వర్గాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని.. అన్నీ పింక్ బుక్(Pink Book)లో రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌కు మిత్తితో సహా చెల్లిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.






