- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha: పాస్ మార్కుల సంగతి తర్వాత.. CM రేవంత్ హాఫ్ సెంచరీ పూర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం పలువురు యువకులు తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి కవిత కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారు.. కీలక పాత్ర పోషించారు. అదే స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలి.. నడుం బిగించాలి. బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదని కవిత అన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్లకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని సర్కార్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు.
కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్ధరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫొటో విడుదల చేసింది. ఆ ఫొటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో అర్థమవుతోంది. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారు. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలి. ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని.. జాబ్ కాంగ్రెస్‌లో చేస్తున్నానని సీఎం అన్నారు. చేస్తున్న జాబ్‌లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదని కవిత విమర్శించారు.
పాస్ మార్కుల సంగతి పక్కడబెడితే.. ఢిల్లీకి వెళ్లడంలో మాత్రం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారని ఎద్దేవా చేశారు. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేకుండే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. విద్యార్థల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంటు బకాయిలు ఉన్నాయి. తక్షణమే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్య భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోంది. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలని సూచించారు.






