- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ పరువు తీశారు.. CM రేవంత్‌పై కవిత ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘రేవంత్‌రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదు. ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు.. మంచి పథకాన్ని ప్రారంభించిందీ లేదు.. కనీసం ఒక్క మహిళకు కూడా 2500 చొప్పున ఇవ్వలేదు. పైగా ఢిల్లీలో కూర్చొని రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి మాట్లాడి తెలంగాణ పరువుతీశారు’ అని ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
కాంగ్రెస్ 15 నెలల పాలనలో రూ.లక్షా 52 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని సోమవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కారు(Revanth Govt) ఒక్క మంచి పని సైతం చేయలేదని, మరి ఈ నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళ లకు ప్రతి నెలా రూ.2,500 ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు సంపూర్ణంగా అమలు కావడం లేదని, వరికి బోనస్ బోగస్ అయ్యిందని విమర్శించారు. అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన అప్పులో ప్రతి పైసాకూ లెక్క చెప్తామని, మరి రూ. లక్షా 50 వేల కోట్ల అప్పుకు సీఎం రేవంత్ లెక్క చెప్తారా? అని సవాల్ విసిరారు.






