- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు MLC కవిత రిప్లై
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. దీనికి రిప్లై ఇస్తూ శుక్రవారం ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం, స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. తమిళనాడు(Tamil Nadu) ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ఎక్స్ వేదికగా కవిత ట్వీట్ చేశారు. కాగా, ఈ సంక్రాంతి వేడుకలను కవిత గ్రాండ్‌గా జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలను కవిత ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. కవిత స్వయంగా ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలు పెట్టి.. పాలుపొంగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరుకున్నారు.






