సహాయక చర్యలు ముమ్మరం చేయండి : వరదలపై ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత విన్నపం

by Muthe.Rajitha |

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla kavitha) కోరారు.

సహాయక చర్యలు ముమ్మరం చేయండి : వరదలపై ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత విన్నపం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla kavitha) కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న పలువురితో మాట్లాడితే ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వారిని ప్రభుత్వం వెంటనే తరలించి తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా చోట్ల ఆహార పదార్థాల కొరత ఉందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు కవిత పేర్కొన్నారు.

Next Story