- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు MLC కవిత లేఖ
బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. కొత్తగా అధ్యక్షుడిగా నియమితులైన రాంచందర్‌రావు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తరతరాలుగా సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైనదని.. అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు. సమాన అవకాశాల కోసం బీసీలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తున్నదని తెలిపారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి, యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. బీసీ సమాజం ఉద్యమాలకు దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని తెలిపారు. ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపి చాలా కాలం అవుతున్నా ఇంకా ఆమోదముద్ర పడలేదని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులకు చట్టరూపం తెచ్చి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.





