MLC Kavitha: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక రిక్వెస్ట్

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఏపీ సీఎంకు కీలక రిక్వెస్ట్ చేశారు.

MLC Kavitha: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలో హథీరాం బావాజీ మఠం (Hathiram Baba Math) కూల్చివేతకు అధికారులు రెడీ అవుతున్నారు. పురాతన నిర్మాణం కావడంతో కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కూల్చివేత పనులకు టెండర్లు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈ మఠాన్ని కూల్చివేయవద్దని డిమాండ్‌లు వస్తున్నాయి. మరోవైపు ఈ భవనాన్ని కూల్చివేస్తే తమ బతుకుదెరువు పోతోందని అక్కడి వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఏపీ సీఎంకు కీలక రిక్వెస్ట్ చేశారు.

తిరుపతి హథీరాం బావాజీ మఠం కూల్చివేత ప్రయత్నాలు విరమించుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. హాథీరాం బావాజీ మఠం భవనం కూల్చివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాథిరామ్ బావాజీని ఆరాధించే బంజారాల మనోభావాలను దెబ్బతీస్తోందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని హాథీరాం బావాజీ మఠం కూల్చివేత నిర్ణయం వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఏపీ సీఎంకు టీటీడీ దేవస్థానానికి ట్యాగ్ చేశారు.

Next Story