- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా?.. ప్రభుత్వాన్ని నిలదీసిన MLC
గత 15 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గత 15 నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. శనివారం ఆమె మండలిలో మాట్లాడుతూ.. పరిశ్రమలు తెలంగాణ నుంచి తమిళనాడు, గుజరాత్‌కు తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కాబట్టి ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజల్లో అభద్రత భావం ఏర్పడిందని, ఎల్ఆర్ఎస్(LRS)కు ఫీజులు తీసుకోబోమని.. ఇప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా(Hydraa)తో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించడం సరికాదని అన్నారు.
ఇక జయజయహే తెలంగాణ గీతానికి(Telangana Anthem) ఆంధ్రా వ్యక్తితో సంగీతం ఇప్పించడం సరికాదని, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమ కాలంలో పార్టీలకతీతంగా తెలంగాణ తల్లికి నాయకులు దండలు వేశారని, ఇప్పుడు అదే తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం బాగలేదని తేల్చిచెప్పారు. ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉందని ప్రభుత్వం చెబుతున్నదాన్ని ప్రజలు అంగీకరించడం లేదని తెలిపారు. దాశరథి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం కూడా చేయడం లేదని, వెంటనే దాశరథి శతజయంతి సందర్భంగా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి సూచన చేశారు.
అలాగే, మైనారిటీలకు కాంగ్రెస్(Congress) పార్టీ, ప్రభుత్వం రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోవడం సరికాదని సూచించారు. గంగా జమునా తెహజీబ్ వంటి తెలంగాణలో మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తోందని, మైనారిటీ మంత్రి లేకుండా ఎప్పుడూ మంత్రివర్గం లేదని అన్నారు. మరోవైపు, ఎమ్మెల్సీ తాతా మధును ఉద్ధేశించి సభలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన “న్యూసెన్స్” అనే వ్యాఖ్యను ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. ఆ పదాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని చైర్మన్ కు మండలిలో విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి.. అది అన్ పార్లమెంటరీ పదమైతే తప్పకుండా తొలగిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... శాసన మండలిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్న పచ్చి అబద్దాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే... న్యూసెన్స్ చేయవద్దని చైర్మన్ సుఖేందర్ రెడ్డి కామెంట్ చేశారని, ఆ వ్యాఖ్యను రికార్డుల్లో నుంచి తొలగించాలన డిమాండ్ చేశారు. గతంలోనూ తమ సభ్యులను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడారని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు శాసన మండలిలో సముచిత గౌరవం ఇవ్వలేదని, ఇది ప్రభుత్వ కక్షసాధింపులో భాగమేనని ధ్వజమెత్తారు.






