- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సీఎం గారూ.. ముందు ఆ పనిచేయండి’: ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్
జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ మండలంలో ఉన్న గురుకుల స్కూల్లో గురువారం మధ్యాహ్న భోజనం(Food Poisoning Incident) వికటించింది.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ మండలంలో ఉన్న గురుకుల స్కూల్లో గురువారం మధ్యాహ్న భోజనం(Food Poisoning Incident) వికటించింది. దీంతో ఆ ఆహారం తిన్న 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం వాంతులు, కడుపునొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉందని తేలింది. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు.
‘అరాచక కాంగ్రెస్ పాలనలో దయనీయంగా గురుకులాలు.. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ప్రభుత్వ చేతగానితనం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులపై చిల్లర మాటలు మాట్లాడటంపై పెట్టే శ్రద్ధ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంపై చూపిస్తే బాగుంటుంది’ అని సోషల్ మీడియా వేదికగా కవిత విజ్ఞప్తి చేశారు.






