- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్పటికైనా తప్పకుండా CM అవుతా: MLC కవిత
by Gantepaka Srikanth |
రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దూకుడు పెంచారు. జాగృతి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దూకుడు పెంచారు. జాగృతి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. జాగృతి సంస్థ ఉద్యమం నుంచే ఉండగా.. ఉద్యమంలో సాంస్కృతిక అంశాలపై పోరాడింది. మరోసారి దీనిని బలోపేతం చేయడానికి కవిత కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం వేగం పెంచారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఓపెన్‌గా మాట్లాడారు. మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'ఇంకో పదేళ్లకో, పదిహేనేళ్లకో, ఎప్పటికైనా తప్పకుండా ముఖ్యమంత్రి అవుతా. ఎవరైనా రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎదగాలనే కోరుకుంటారు' అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. నిజామాబాద్‌పై దృష్టి సారిస్తా.. ఊహించని రీతిలో అభివృద్ధికి ప్రయత్నిస్తా అని చెప్పారు.
Next Story






