- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చాలా కష్టపడ్డావు.. ఎంతో ఎదిగావు’: కొడుకు గురించి కవిత ఎమోషనల్ ట్వీట్
‘ఆదిత్యా.. నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఎంత గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా కష్టపడ్డావు. ఎంతో ఎదిగావు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఆదిత్యా.. నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఎంత గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా కష్టపడ్డావు. ఎంతో ఎదిగావు. మేమందరం గర్వపడేలా చేశావు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో పుత్రోత్సాహాన్ని చాటారు. ఒక తల్లిగా ఎంతో గర్వపడుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. కవిత పెద్ద కొడుకు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యురేషన్ పట్టాను అందుకున్నాడు. గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత, అనిల్‌కుమార్ దంపతులు హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ కవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏడు రోజుల పాటు అమెరికా పర్యటన కోసం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కవితకు అనుమతినిచ్చింది. దాంతో ఈ నెల 23వ తేదీన ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు.






