- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha : పాశమైలారం క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
సోమవారం పఠాన్ చెరువులోని పాశమైలారం(PashaMylaram) పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమ(Sigachi Explosion)లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సోమవారం పఠాన్ చెరువులోని పాశమైలారం(PashaMylaram) పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమ(Sigachi Explosion)లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 39 మంది మరణించగా.. 35 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరో 20 మంది మృతదేహాల కోసం గాలిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సిగాచీ పరిశ్రమ ప్రమాదం అత్యంత దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కవిత మండిపడ్డారు.
పరిశ్రమల్లో రక్షణపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదస్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. మళ్ళీ ఇలాంటి ఘటనలూన పునరావృత్తం కాకుండా చర్యలు చేపడతామని, మృతులకు, గాయపడిన వారికి కంపెనీ నుంచి తగిన నష్ట పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.






