కుమారుడితో అమెరికాకు MLC కవిత పయనం.. సెండాఫ్ ఇచ్చిన భర్త అనిల్

by Kema Shiva Kumar |

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇవాళ తన చిన్న కుమారుడు ఆర్య (Arya)తో కలిసి అమెరికాకు బయలుదేరారు.

కుమారుడితో అమెరికాకు MLC కవిత పయనం.. సెండాఫ్ ఇచ్చిన భర్త అనిల్
X

దిశ, వెబ్‌‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఇవాళ తన చిన్న కుమారుడు ఆర్య (Arya)తో కలిసి అమెరికాకు బయలుదేరారు. ఈ మేరకు ఆమె ఉదయం 9.30కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే భర్త అనిల్, తెలంగాణ జాృగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆమెకు సెండాఫ్ చెప్పారు. అనంతరం ఆమె ఇంటర్‌నేషనల్ డిపార్చర్ నుంచి బోర్డింగ్ పాయింట్‌ వెళ్లారు. కాగా, ఎమ్మెల్సీ కవిత 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. తిగిరి ఆమె సెప్టెంబర్ 1న హైదరాబాద్‌కు రానున్నారు.

Next Story