- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది తేలే వరకు బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటా..ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన
బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఎప్పుడూ నష్టం చేయనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో కవిత పార్టీ మారుతున్నారా..? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఎప్పుడూ నష్టం చేయనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో కవిత పార్టీ మారుతున్నారా..? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు నేరుగా బీఆర్ఎస్‌లో చేరలేదన్నారు. తెలంగాణ జాగృతిని స్థాపించి 8ఏళ్లు పనిచేశానని చెప్పారు. ఎంపీగా పోటీచేసిన సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. తాను జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలినే అని వాఖ్యానించారు.
బీసీ రిజ్వేషన్ల అంశం గురించి చెబుతూ.. బీఆర్ఎస్‌తో తనకు బేధాభిప్రాయాలు లేవని, అభిప్రాయబేధాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పార్టీ మీటింగులో కేసీఆర్ స్వయంగా చెప్పారని జాగృతి వాళ్లు వాళ్ల కార్యక్రమాలు వాళ్లు చేసుకుంటారని, మీ పని మీరు చేసుకోండని అన్నారని తెలిపారు. జాగృతి కార్యక్రమాలను ఎప్పుడూ కేసీఆర్ వ్యతిరేకించలేదన్నారు. పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. లెటర్ ఎవరు లీక్ చేశారో చెప్పాలని అడిగానని, అది చెప్పేవరకు పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు.
పార్టీ వాళ్లను పట్టుకుని బయటకు పంపాలని అన్నారు. ఈ ఇష్యూకు తెరపడితే అన్ని విషయాలు సర్దుకుపోతాయన్నారు. అంతేకాకుండా తన ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే పనికూడా ఎప్పుడూ పనిచేయనని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందకు ప్రయత్నించారంటూ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చాలా ఏళ్లుగా సీఎం రమేష్ తనకు తెలుసని అన్నారు. జైలుకు వెళ్లే ముందు నుండి ఇప్పటి వరకు ఆయనతో మాట్లాడలేదని చెప్పారు. లేఖ లీక్ చేసినవాళ్లే సీఎం రమేష్ తో మాట్లాడించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.






