MLC Kavitha: ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్ ఇదే

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

MLC Kavitha: ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై ఆమె స్పందిస్తూ ఇవాళ మీడియాతో మాట్లాడారు. నేడు ఉద్యోగులు బాధలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (Congress Govt Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక మాటలు చెప్పిందన్నారు. ఎన్నికలకు ముందు (Government employees) ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న (Pending DA) డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డీఏ విదిల్చారని.. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని ఆవేదన చెందారు.

ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, (Employees Pending Da) పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇవాళ (శనివారం) నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అబ్బన్న తల్లి ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Next Story