- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పుడేం సమాధానం చెప్తారు?.. బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన (Gambhira Bridge) కుప్పకూలిపోయింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో దాదాపు పదిమంది మృతిచెందారు. తాజాగా ఈ వంతెన కూలిన ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పందించారు.
‘డబుల్ ఇంజన్ సర్కార్ పాలన అని ఊదరగొట్టే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. మొన్న గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలి వందలాది ప్రజలు చనిపోయిన ఘటన మరువకముందే నేడు అదే గుజరాత్‌లోని గంభీర వంతెన కూలి పది మంది మృతి చెందడం బాధాకరం. బీజేపీయేతర రాష్ట్రాల్లో చిన్న సంఘటన జరిగినా రాద్దాంతం చేసే కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌లో జరిగిన ఘటన పై ఏం సమాధానం చెప్తారు?’ అని కవిత ప్రశ్నించారు.
అంతకుముందు ఈ ఘటనపై కేటీఆర్ సైతం స్పందించారు. ఈ ఘటనతో బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయలు అయిందని కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్‌లు ఉన్న రాష్ట్రాల్లోనే వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి..? వీటిపై ఎన్‌డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు విచారణ జరుపుతాయా..? ఇదేనా మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ ‘మోడల్’? ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి..!’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read More... Harish Rao: మీకో నీతి మాకో నీతా? గుజరాత్ లో వంతనె కొలాప్స్ విషయంలో బీజేపీపై హరీశ్ రావు హాట్ కామెంట్స్






