కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-13 15:53:26  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారని అన్నారు.

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మే 26న విచారణకు హాజరుకావాలని గతంలో నోటీసులు ఇవ్వగా విదేశీపర్యటన కారణంగా తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

Next Story