- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC KAVITHA: పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత
పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలంటూ బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలంటూ బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ నుండి ఆమెను విడుదల చేశారు. విడుదలైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు... ధరలు పెంచడం కాదు, ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేయాలని అన్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చినట్టు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి నిధులు కేటాయించాలని సూచించారు. ధరలు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు.
మహిళలకు ఫ్రీ బస్ వల్ల మగవాళ్లు టికెట్ కొనుగోళు చేసి కూర్చున్నా వారికి కూర్చునే అవకాశం లేదని అన్నారు. టికెట్ రేట్లు పెంచుతున్నారు తప్ప బస్సులు పెంచడం లేదని మండిపడ్డారు. ధర్నా చేసిన ప్రతిసారి అరెస్ట్ చేయడం కాదని, ప్రజల ఆదాయ మార్గాలను పెంచాలని అన్నారు. సామాన్య ప్రజలపై భారం వేస్తూ ఆర్టీసీ ఛార్జీలు పెంచవద్దని అన్నారు. ఫ్రీ ఇచ్చినా మహిళలకు బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని అన్నారు. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు.






