- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదుకు కవిత! వారిని కల్వనున్న జాగృతి అధ్యక్షురాలు?
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (MLC Kavitha) కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం హైదరాబాద్ మేడిపల్లిలోని మల్లన్న (Q News Office) క్యూ న్యూస్ ఆఫీస్‌పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే, జహీరాబాద్ పర్యటనలో నిన్న (Teenmar Mallanna) తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శనివారం జహీరాబాద్ వద్ద బీసీ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ కవితపై ఎమ్మెల్సీ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం.
కాగా, తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇవాళ సాయంత్రం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటలకు డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా, జాగృతి కార్యకర్తల దాడి సమయంలో తీన్మార్ మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ జాగృతి కార్యకర్తకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. నేరుగా గన్ మెన్ తుపాకీతో కార్యకర్తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.






